Saturday 16 January 2016

"నాన్నకు ప్రేమతో"


సంక్రాంతి పండుగ అయిపోయిందా...   లేదు అది అప్పుడే అవదు.  "నాన్నకు ప్రేమతో"  సినిమా చూసారా  చూడలేదా?  థియేటర్ లో ఆ సినిమా  చూడకుండా సంక్రాంతి సెలవలు ఆనందించం అని మీరు అనుకుంటే...... అది ఉట్టిదే......
ఈ సినిమా ఎలా ఉండి? ఈ సినిమా లో గొప్ప విషయాలు  ఇవి   అని చెప్పడానికి  నేను ఇది రాయటం లేదు.  ఈ సినిమా చూస్తూ కలిగిన ఆనందం వ్యక్తపర్చకుండా  ఆ ఎమోషన్  ని నాలోనే దాచేసుకుంటే  సుకుమార్ చెప్పిన విషయాల్ని నేను పాటించనట్టే కదా......  ఏ ఎమోషన్  అయినా వ్యక్తపరచాలి. అబ్రహం మాస్లో  చెప్పిన  Hierarchy of Human Needs  థియరీ  చెప్పడం తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.
  తెలుగుప్రేక్షకుల స్థాయిని పెంచే రీతిలో ...తెలుగు ప్రేక్షకుల  స్థాయిని  అర్థం చేసుకున్న  స్థితి లో తీసిన సినిమా ఇది.  అసలు ఈ సినిమా  ఇంకా ముందే చూడాల్సి ఉంది..   అనవసరమైన  హైరానా తో  నెగటివ్ టాక్ ఎందుకు తీసుకొచ్చారో   నాకైతే అర్థం కాలేదు.
 ఈ సినిమా గురించి ఎవడి అభిప్రాయం వినొద్దు.  ఆఖరికి  నా అభిప్రాయం కూడా...ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే   ఒక కుహనా మేథావి ( అసలు వీడికి  ఇదే పని) సైన్స్ పాఠం లా ఉందే.. అంటూ  థియేటర్ నుండే  ఎఫ్. బి. లో పెట్టడం మొదలుపెట్టాడు.  అంటే అసలు వెళ్ళడమే లోపాలు వెతకడానికి వెళ్లినట్టు ఉన్నాడు.  ఒక సోషియో ఫేంటసీ సినిమాని  హర్షించేటపుడు  ఈ సినిమా లో లాజిక్ లు వెతకడం ఏమిటి?
అసలు సినిమాని విశ్లేషించి  ఇలా ఉంటె బాగుణ్ణు  అలా తీయాల్సి ఉంది అంటూ వివరణలివ్వడం వలన ఉపయోగం ఉందా.........
దయచేసి  సినిమాని ఆనందించే అద్భుతమైన  గుణం,   అధ్బుతమైన సెల్యూలాయిడ్ వర్ణచిత్రాలను ఆహ్లాదించే  రసస్పూర్తి మీలో ఉంటె ,  మన తెలుగువాడు   ఒక వినూత్న ప్రయోగాత్మక, ఆలోచింపచేసే  సినిమాని   భారీ బడ్జెట్  లో  తీసిన ధైర్యాన్ని ప్రశంసించే  స్పందించే మనసు మీకు ఉంటె...  వెంటనే ఈ సినిమాని చూడండి..  ఆనందించండి...  ఇందులో సీన్లు, డైలాగ్ లు  ప్లస్ పాయింట్స్  మైనస్ పాయింట్స్  నేను ఇక్కడ రాస్తే  మీ  ఆలోచన్ స్థాయిని, సినిమాని అర్థంచేసుకోగల  స్థాయిని నేను అవమానపరిచినట్టే......
ఇది బాగో లేదు అంటూ  కొంతమంది చేసిన నెగటివ్ ప్రచారంలో పడి  రెండురోజులు ఆలస్యంగా ఈ సినిమా చూసిన తప్పును  మీరు చేయకండి....    అయ్యో ఈ సినిమా బాగోలేదట  అంటూ తప్పుచేసాను అన్న   నెగటివ్ ఎమోషన్ కి   సుకుమార్ కి సారీ   చెబుతూ..........ఇందులో నేర్చుకోవలసిన  విషయాలు, మేనేజ్ మెంట్ విషయాలు   ఈ సినిమా ఏభై రోజుల ఫంక్షన్ కి మరో బ్లాగ్ లో రాస్తానని తెలియచేస్తూ.....
తెలుగు ప్రేక్షకులు ఎ  బి  సి    అంటూ ఉండరని రుజువు చేయడానికి   వీలైనంత  త్వరలో   చూడండి......  
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com

Wednesday 13 January 2016

"" టామీ! వియ్ లవ్ యూ "

"" టామీ! వియ్ లవ్ యూ ""


                 
                           రచన...... .అలజంగి ఉదయ కుమార్ 


ఆఫీస్ నుండి రాగానే భార్యని అడిగాడు ఆనందరావు వాళ్ళ 

అబ్బాయి రాజేష్ ఎక్కడని... స్కూల్ నుండి వచ్చి ఇప్పుడే 

ఎక్కడకో వెళ్ళాడని చెప్పింది. భార్య సుమతి. ఇప్పుడు 

రావడమేమిటి? స్కూల్ నాలుగు గంటలకు అయిపోతుంది 

కదా.. రెండు గంటలు ఎందుకు పట్టింది. స్కూల్ కూడా 

ఇంటికి దగ్గరేగా అడిగాడు. నాకేమి తెలుసండి... ఫ్రెండ్స్ తో 

మాట్లాడుకొని వచ్చి ఉంటాడు. అయినా వాడికి నేను చేసే 

టిఫిన్స్ నచ్చావు. బయట చాట్, పానీపూరీ తినడానికి 

ఫెండ్స్ తో వెళ్లి ఉంటాడు. .. ఎనిమిదో తరగతికి వచ్చాడు 

కదా. అన్ని అడిగితె బాధపడతాడు కదా. ...

అయినా స్కూల్ కి ఒక్కసారి వెళ్లి కనుక్కోవచ్చుకదా ఎలా 

ఉందొ వాడి చదువు. ఎలా వెళ్లాలి. మూడు నెలలనుండి ఫీజు 

కట్టలేదు కదా.. వెళ్తే దాని గురించి అడిగి మిగిలిన 

విషయాలు తర్వాత చెబుతారు" ఈసడింపుగా అంది 

సుమతి. అది  నిజమేలే.. కొత్త చిట్లు కట్టడం వలన స్కూల్ 

ఫీజు కట్టడం లేటు అవుతుంది. ఈ మధ్య ఫంక్షన్స్ కూడా 

ఎక్కువవడం వలన డబ్బు కొంచెం టైట్ గా ఉండి. చూసుకొని 

కట్టేద్దాం లే .. అయినా మనం ఎక్కడకి వెళ్ళిపోతాం. స్కూల్ 

అన్నాక చదువు కి ప్రాధాన్యత ఇవ్వాలి గాని ఫీజులే 

ముఖ్యమా ? ఆనందరావు భార్యతో ఆనాడు. సరే గాని నా 

ముఖాన్ కొంచెం టీ తగలెట్టు విసుక్కుంటూ అడిగాడు. 

ఫీజులు ఊసెత్తితే చాలు మీకు ఎక్కడ లేని చిరాకు వస్తుంది. 

ఒక్క క్షణం ఆగండి అంటూ వంటగది లోకి వెళ్ళింది సుమతి. 

" సుమతీ!" అని ఒక్కసారి పెద్ద కేక విని వంటగదిలోంచి 

పరుగెత్తుకొచ్చింది. ఏమయిందండి. "" నీతో మాటల్లో పడి 

మరిచాను. టామీ ఏది. వచ్చి ఇంత సేపయినా కనపడలేదు. 

వచ్చిన వెంటనే నా వద్దకు వచ్చేది.


అయ్యో ఇప్పుడే దానికి ఇష్టమని పెడిగ్రీ పాలలో వేసి 

పెట్టాను. ఇక్కడే ఉండాలి. చూడండి. వరండాలో గాని 

మంచం క్రింద ఉందేమో.. భార్యాభర్తలు ఇద్దరూ ప్రయాస పది 

తామీని వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్లిందో . ఊర 

కుక్కలతో కలిస్తే లేనిపోని అలవాట్లు నేర్చుకుంటుంది. ఏ 

కుక్క కరిచేస్తుందో .... అయిన నీకు శ్రద్ధ లేకుండా పోతుంది. 

నీకు తెలుసు కదా టామీ అంటే నాకెంత ప్రేమో... 

ఆనందరావు తిట్ల దండకం చదువుతూ అన్వేషణ 

కొనసాగించాడు. కాలనీ అంతా తిరిగారు. ఎక్కడా దొరకలేదు. 

తెలిసినవాళ్లకు ఫోన్ లు కూడా చేసారు. ఇల్లంతా శ్మశాన 

నిశ్శబ్దం.. ఒకరినొకరు భాద్యత లేదంటూ పరస్పరం 

విమర్శించుకొని అలసిపోయారు. ఈ లోగా టామీ అరుపు 

వినబడి ఒక్క ఉదుటున లేచారు .. ముందు గదిలో దివాన్ 

కాట్ క్రింద హాయిగా పడుకొని అప్పుడే లేచింది టామీ. 

కడుపునిండా తిండి పెట్టడం వలన ఒళ్ళు మర్చి నిద్ర 

పోయింది. ఇదరూ ఒక్క ఉదుటన దగ్గరకు తీసుకొని 

ముద్దుల వర్షం కురిపించారు. .. ఈ హడావుడి లో రాజేష్ 

ఊరంతా తిరిగి టీవి ముందు కూర్చొని వాడికి నచ్చిన 

సీరియల్స్ లో మునిగిపోయిన సంగతి కూడా పాపం 

మరచిపోయారు. కుక్కని ముద్దులాపి వాడి మీద 

తిట్లదండకం మొదలుపెట్టడం ఇక వారి తర్వాత 

కార్యక్రమం....... టామీ మాత్రం హాయిగా వాళ్ళ ఒడిలో 

ఆడుకుంటుంది......

                   ....by Uday Kumar Alajangi......